Header Banner

టెస్లా కోసం ఏపీ భారీ ఆఫర్లు.. ఆ జిల్లాలకే ఛాన్స్! రాష్ట్ర భవిష్యత్ కు గేమ్ ఛేంజర్ గా..!

  Sun Feb 23, 2025 13:44        Politics

ప్రపంచ దిగ్గజ సంస్థ టెస్లా కి వస్తుందా. ఎంత మేర అవకాశం ఉంది. ఇప్పుడు టెస్లా తమ కార్ల తయారీ యూనిట్ దక్షిణాది రాష్ట్రాల్లో నెలకొప్పేందుకు ఆలోచన చేస్తోందని సమాచారం. దీంతో, ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇందు కోసం టెస్లా కు ఏపీ ప్రభుత్వం భారీ ఆఫర్లు ఇస్తోంది. రాయితీలతో సహా భూముల లభ్యత గురించి టెస్లా తో ఏపీ ముఖ్యులు సంప్రదింపులు కొనసాగిస్తున్నారు. టెస్లా ఏర్పాటు కోసం కొన్ని ప్రతిపాదనలు చేసినట్లు తెలుస్తోంది. టెస్లా ఏపీకి వస్తే రాష్ట్ర భవిష్యత్ కు గేమ్ ఛేంజర్ గా మారనుంది. ఏపీ ప్రభుత్వం ఆఫర్ ఏపీకి టెస్లా రప్పించేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. ప్రపంచ దిగ్గజ సంస్థగా ఉన్న టెస్లా తక్కువ ధరకు ఎలక్ట్రిక్‌ వాహనాలను భారతీయ మార్కెట్ లో అందుబాటులోకి తెచ్చేందుకు కొత్త ప్రణాళికలతో ముందుకు వస్తోంది. కార్ల తయారీ ప్లాంట్ ను దక్షిణాది రాష్ట్రాల్లో ప్రారంభించాలని భావిస్తోంది. ఈ సమయంలో ఏపీ ప్రభుత్వం అలర్ట్ అయింది.


ఇది కూడా చదవండి: అరబ్ అడ్వొకేట్ తో చర్చించిన అనిల్ ఈరవత్రి! 17 మంది భారతీయులను ఉరిశిక్ష! 


ప్రాధమికంగా టెస్లా తమ యూనిట్ ను రాష్ట్రంలో ఏర్పాటు చేసేందుకు ముందుకు వస్తే తమ నుంచి అందించే రాయితీలతో పాటుగా భూముల లభ్యత గురించి వివరించారు. దీంతో.. తాజాగా టెస్లా బృందం ఉమ్మడి నెల్లూరు జిల్లాతో పాటు రాయలసీమ జిల్లాలోని భూములను పరిశీలించినట్లు సమాచారం. గేమ్ ఛేంజర్ టెస్లా ఈవీ కార్ల తయారీ యూనిట్‌ను ఏపీలో నెలకొల్పేందుకు 2017లోనే ఆ కంపెనీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. రాయలసీమలో 4 మెగావాట్ల సామర్థ్యంతో రెండు సౌరశక్తి నిల్వ యూనిట్ల స్థాపనకు సాంకేతిక నైపుణ్యాన్ని విస్తరిస్తామని టెస్లా కంపెనీ అధినేత ఎలాన్‌ మస్క్‌కు హామీ ఇచ్చారు. రాష్ట్ర విద్య, ఐటీ, ఎలకా్ట్రనిక్‌ శాఖల మంత్రి నారా లోకేశ్‌ ఇటీవల తన అమెరికా పర్యటనలో భాగంగా టెస్లా కంపెనీ చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ వైభవ్‌ తనేజాను కలిసి ఏపీలో టెస్లా ఈవీ కార్ల తయారీ యూనిట్‌ నెలకొల్పే అంశంపై చర్చలు జరిపారు. టెస్లా వస్తే పెట్టుబడులతో పాటు రాష్ట్రానికి అంతర్జాతీయంగా బ్రాండ్‌ ఇమేజ్‌ దక్కనుంది. దీంతో కూటమి ప్రభుత్వం మరోసారి ప్రయత్నాలు ముమ్మరం చేసింది.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. ప్రతీ సంవత్సరం ప్రతీ వ్యక్తికీ రూ.25లక్షలు.. ఏప్రిల్‌లో ప్రారంభం!

 

ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. ప్రతీ సంవత్సరం ప్రతీ వ్యక్తికీ రూ.25లక్షలు.. ఏప్రిల్‌లో ప్రారంభం!

 

ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. యుద్ధం ముగియాలంటే అదొక్కటే మార్గం!

 

ప్రజలకు అప్డేట్.. ఆధార్ కార్డులో కొత్త మార్పు! ఇది తెలుసుకోకపోతే నీ పరిస్థితి ఇక అంతే!

 

ఆంధ్రప్రదేశ్ లో మరో కొత్త హైవేకు లైన్ క్లియర్! ఈ జిల్లాలకు మహర్దశ!

 

పోలీసులపై చండాలమైన కామెంట్స్ చేసిన జగన్! ఆ కేసు పెట్టి జైలుకు పంపండి.. ఏపీ మంత్రి డిమాండ్!

 

గుంటూరులో జగన్‌ పర్యటన.. మిర్చి రైతులకి కన్నీరు.. 14 మిర్చి టిక్కీలు మాయం! యార్డ్ సీసీటీవీలలో..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #tesla #car #land #ap #todaynews #flashnews #latestupdate